- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాలిబన్, అల్ ఖైదా వలె కేంద్రం వ్యవహరిస్తొంది: సంజయ్ రౌత్
ముంబై: కేంద్ర సంస్థలను విపక్షాలపై ఉసి గొల్పుతున్నారనే ఎనిమిది పార్టీ నేతలు ప్రధానికి రాసిన ఉమ్మడి లేఖ తర్వాత ఉద్ధవ్ థాక్రే మద్దతుదారుడు, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై మండిపడ్డారు. దర్యాప్తు సంస్థల ద్వారా వారిపై జరిపిన దాడులను అల్-ఖైదా తాలిబాన్ దాడులతో పోల్చారు. ప్రత్యర్థులను అంతమొందించేందుకు తాలిబన్, అల్ ఖైదా వలె ప్రభుత్వం సీబీఐ-ఈడీ ఆయుధాలుగా చేసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కేంద్ర సంస్థలతో దాడులను ఉపయోగించి భయోత్పాతానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఇదంతా ప్రజాస్వామ్యం కాదని ఫాసిజాన్ని మించి ఉందని విమర్శించారు.
ప్రధాని మోడీ ఆదేశాలతో ఈ సోదాలు కొనసాగుతున్నాయని అన్నారు. అంతకుముందు ఆదివారం ఎనిమిది రాజకీయ పార్టీల నేతలు మూకుమ్మడిగా సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్రం, దర్యాప్తు సంస్థలను తప్పుగా ఉపయోగించుకోవడం మానుకోవాలని కోరారు.