- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి: నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి
దిశ, నేషనల్ బ్యూరో: గత తొమ్మిదేళ్లలో దేశంలో 24.82కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ నివేదికను రిలీజ్ చేసింది. 2013-14లో 29.17శాతం మంది పేదలుండగా..2022-23 నాటికి 11.28శాతానికి తగ్గింది. అంటే దేశంలో తొమ్మిదేళ్లలో 17.89 శాతం పేదరికం క్షీణించింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 5.94 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందగా, బిహార్‌లో 3.77కోట్లు, మధ్యప్రదేశ్‌లో 2.30కోట్ల మంది బయటపడ్డారు. 2015-16, 2019-21 మధ్య పేదరికం వేగంగా 10.66శాతం తగ్గగా..2005-06, 2015-16 మధ్యలో 7.69శాతం మాత్రమే తగ్గినట్టు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ క్రమంలో 2024 నాటికి భారత్‌లో పేదరిక స్థాయి మరింత తగ్గుతుందని పేర్కొంది. కాగా, పేదరికాన్ని అంచనా వేయడానికి మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ)ను ఉపయోగిస్తారు. 12 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఉపయోగపడే.. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా పేదరిక నివేదికను రూపొందించినట్టు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ..బహుమితీయ పేదరికాన్ని 1 శాతం దిగువకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రతి భారతీయుడికీ సంపన్నమైన భవిష్యత్ అందిస్తాం: ప్రధాని మోడీ
నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికపై ప్రధాని మోడీ స్పందించారు. ‘మరింత ప్రోత్సాహంతో సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి కృషి చేస్తాం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో జరిగిన మార్పులు మా నిబద్దతకు నిదర్శనం. దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాం. ప్రతి భారతీయుడికీ సంపన్న భవిష్యత్ అందించడానికి ప్రయత్నిస్తాం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.