- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్వేషాన్ని నమ్మకంతో భర్తీ చేద్దాం.. మోడీకి అభినందనలు తెలిపిన పాక్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతల చేపట్టిన సందర్భంగా మోడీని అభినందిస్తూ సోషల్ మీడియాలో షెహబాజ్ పోస్టు పెట్టారు. ధన్యవాదాలు తెలుపుతూ ఆయన పోస్టుకు మోడీ రిప్లయ్ ఇచ్చారు. ‘‘ఎన్నికల్లో మీ పార్టీ విజయం మీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని పేర్కొంటూ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వేషాన్ని నమ్మకంతో భర్తీ చేద్దామని పిలుపునిచ్చారు. దక్షిణాసియాలోని రెండు బిలియన్ల ప్రజల భవిష్యత్తును నిర్మించే అవకాశాన్ని తీసుకుందామంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.కాగా, మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏడు పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ.. పాకిస్థాన్‌కు మాత్రం భారత్ ఆహ్వానం పంపలేదు. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయింది. 2014లో మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది భారత జవాన్లు చనిపోయారు. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి.