Navjot Singh Sidhu : సిద్ధూ భార్యకు రూ.850 కోట్ల లీగల్ నోటీసులు.. కారణమిదే..!

by Sathputhe Rajesh |
Navjot Singh Sidhu : సిద్ధూ భార్యకు రూ.850 కోట్ల లీగల్ నోటీసులు.. కారణమిదే..!
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్ధూ భార్య నవ్‌జోత్ కౌర్‌కు చత్తీస్ గఢ్ సివిల్ సోసైటీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.850 కోట్ల లీగల్ నోటీసులు పంపింది. ఇటీవల క్యాన్సర్ ట్రీట్‌మెంట్ రెమెడీ ఇదే అంటూ సిద్ధూ చేసిన సంచలన వ్యాఖ్యలతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. చత్తీస్ గఢ్ సివిల్ సొసైటీ కన్వీనర్ కుల్దీప్ సొలంకి సిద్ధూ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో అల్లోపతి వైద్యంపై తప్పుడు సంకేతాలు పంపుతాయన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారంతో ఇతర పేషంట్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన వారమవుతామని అభిప్రాయపడ్డారు. కొంత మంది క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఆపివేసే ప్రమాదం ఉందని తెలిపింది. సిద్ధూ భార్య కౌర్ వారంలోగా తన భర్త చేసిన వాదనలను సమర్ధించే సాక్ష్యాలను అందించాలని ఆదేశించారు. లేని పక్షంలో రూ.850 కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు. సాక్ష్యాలను సమర్పించకుంటే లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని సీసీఎస్ స్పష్టం చేసింది.

సిద్ధూ అసలేం ఏమన్నారంటే..?

క్యాన్సర్‌ను వాపుతో పోల్చిన సిద్ధూ.. ఇది పాలు, గోధుమపిండి, మైదా, చక్కెరలతో వస్తుందన్నాడు. క్యాన్సర్ చక్కెరను తింటుందని.. అదే క్యాన్సర్‌ను బతికిస్తుందని సిద్ధూ కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. తన భార్య కౌర్ 4వ స్టేజ్ క్యాన్సర్ జయించిందని తెలిపాడు. వైద్యుల మీదే ఆదారపడకుండా కఠినమైన జీవనశైలి, ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో క్యాన్సర్ నుంచి బయట పడినట్లు తెలిపాడు. నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా క్యాన్సర్‌ను జయించవచ్చని తెలిపాడు.

Advertisement

Next Story