- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొరేన్‌ను చూసి నేర్చుకోండి: కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచన
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసినా సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పించింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను చూసి కేజ్రీవాల్ ఎంతో నేర్చుకోవాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ నైతిక కోల్పోయారని విమర్శించారు. ‘నైతికత కూడా ఎంతో అవసరం. దానిని కేజ్రీవాల్ కోల్పోయారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం చట్ట విరుద్ధం’ అని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు సీఎం అవుతారని బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా ఏనాడూ కలగని ఉండకపోవచ్చని చెప్పారు. అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసినా ప్రభుత్వాన్ని నడపడం ఎందుకని ప్రశ్నించారు. ‘ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ని జైలుకు పంపినప్పుడు ఆయన భార్యను సీఎం చేశారు. మీరు కూడా రిజైన్ చేసి మీ భార్యను సీఎంని చేయండి. లేదంటే హేమంత్‌ను చూసి నేర్చుకోండి’ అని కేజ్రీవాల్‌కు సూచించారు. కాగా, భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయకముందే సొరేన్ సీఎం పదవికి రాజీనామా చేశారు.