- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న 15 పార్టీల నాయకులు
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న లోక్ సభ స్పీకర్ తో కలిసి ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు పార్టీల నాయకులకు ఆహ్వానాలు పంపింది. అయితే దేశ ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్మును కార్యక్రమానికి పిలవకపోవడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతితో కొత్త పార్లమెంట్ కు ప్రారంభోత్సవం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బాయ్కాట్ చేస్తున్నట్లు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు ప్రకటించాయి. కాగా ఈ కార్యక్రమంలో 15 పార్టీల నాయకులు పాల్గొననున్నారు.
ఆ పార్టీలు ఏవంటే.. భారతీయ జనతా పార్టీ (BJP), శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP), సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM), రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP), అప్నా దళ్ (సోనీలాల్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI), తమిళ్ మనీలా కాంగ్రెస్, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP), తెలుగుదేశం పార్టీ (TDP), శిరోమణి అకాలీదళ్ (SAD), బిజు జనతాదళ్ (BJD). కాగా దేవనాథన్ యాదవ్ స్థాపించిన తమిళనాడుకు చెందిన భారత మక్కల్ కల్వీ మున్నేట్ర కజగం (IMKMK) కూడా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది. కాగా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వెళ్తుందా లేదా అనేది ఇవాళ తేలనున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.