- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మతమార్పిళ్లుకు వ్యతిరేకంగా చట్టం తేవాలి: పంజాబ్ ప్రచారంలో కేజ్రీవాల్
ఛంఢీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మతమార్పిళ్ల పై కీలక వ్యాఖ్యలు చేశారు. మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరముందని, కానీ ఎవ్వరిని తప్పుగా వేధించకూడదని అన్నారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలంధర్‌లో ఆయన మాట్లాడారు. 'మతం అనేది వ్యక్తిగత అంశం. దేవుని పట్ల విశ్వసనీయత కలిగి ఉండటం ప్రతి ఒక్కరి హక్కు. మతమార్పిళ్లుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓ చట్టం రావాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరినీ తప్పుగా విధించకూడదు. బలవంతంగా చేసే మార్పిళ్లు తప్పే' అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ బలవంతపు మత మార్పిడులపై చట్టం తీసుకొచ్చాయి.
హర్యానా, అస్సాం రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా పంజాబీలకు కేజ్రీవాల్ 10 హామీలు ఇచ్చారు. ఆప్ అధికారంలోకి వస్తే కొత్త పన్ను అమలు చేయమన్నాడు. దీంతో పాటు పరిశుభ్రత, డ్రైనేజీ, ఇతర నిర్వహణతో పాటు నగరాలను పరిశుభ్రంగా మార్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ అధికారులు ఇంటి వద్దకే వచ్చి డాక్యుమెంట్లు అందించేలా మార్పులు యడమే కాకుండా, మొహల్లా క్లినిక్‌లను నవీణికరణ చేస్తామని తెలిపారు. 117 స్థానాలున్న పంజాబ్‌లో వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్‌లు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.