ఉరిశిక్షకు బదులు తుపాకీతో చంపితే ఎలా ఉంటుంది?

by S Gopi |   ( Updated:2023-03-21 14:16:01.0  )
ఉరిశిక్షకు బదులు తుపాకీతో చంపితే ఎలా ఉంటుంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరణశిక్ష అమలు విషయంలో ఉరివేసి ప్రాణాలు పోయేలా చేయడం విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు బదులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో మరణశిక్ష అమలు చేసే విషయంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని మంగళవారం సూచించింది. ఉరిశిక్ష పడిన ఖైదీలకు నొప్పి లేకుండా జీవితాన్ని ముగించే అవకాశం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉరిశిక్షకు బదులు తుపాకీతో కాల్చి చంపడం, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం, ఎలక్ట్రికల్ చైర్ తో ప్రాణాలు పోయేలా చేయడం వంటి అంశాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. ఉరి అనేది చాలా బాధకరమైన ముంగిపు అన్న ధర్మాసనం.. దీనికంటే తక్కువ బాధ కలిగించే మరణ శిక్ష అమలుపై చర్చలు ప్రారంభించాలని అవి న్యాయపరిధిలోనే ఉన్నాయా అనేది చూసుకోవాలని తెలిపింది. ఇతర దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై ఏమైనా సమాచారం ఉందా అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించగా ఉరి శిక్ష చాలా కృూరమైనదన్న లా కమిషన్ నివేదికను పిటిషన్ తరపు న్యాయవాది రిషీ మల్హోత్రా ధర్మాసనం ముంది చదివి వినిపించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed