లేటరల్ ఎంట్రీ నియమకాల ప్రకటన రద్దు చేసిన యూపీఎస్సీ

by M.Rajitha |
లేటరల్ ఎంట్రీ నియమకాల ప్రకటన రద్దు చేసిన యూపీఎస్సీ
X

దిశ, వెబ్ డెస్క్ : విపక్షాల తీవ్ర విమర్శలతో లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు నియామకాల ప్రకటనను రద్దు చేస్తున్నట్టు యూపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గల సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శుల వంటి ఉన్నత స్థాయిలోని 45 ఉద్యోగాలు యూపీఎస్సీతో సంబంధం లేకుండా లేటరల్ ఎంట్రీ పద్ధతిలో ప్రైవేట్ రంగాలలో నిపుణులతో భర్తీ చేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ విధానం వల్ల దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొంతమంది ఎన్డీయే నేతలు కూడా ఈ లెటరల్ ఎంట్రీ విధానం రిజర్వేషన్లను అణచివేయడమేనని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో లేటరల్ ఎంట్రీ కోసం ఇచ్చిన ప్రకటనను రద్దు చేయాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాయగా.. కొద్దిసేపతి క్రితమే యూపీఎస్సీ ఆ ప్రకటనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed