- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో లాలూను ప్రశ్నించిన సీబీఐ..
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ విచారించింది. మంగళవారం ఆయన నివాసంలో సుమారు 5 గంటల పాటు ప్రశ్నించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్జేడీ వ్యవస్థాపకుడిని ప్రశ్నించడం పూర్తిగా వీడియో గ్రాఫ్ చేశారు. ఈ మధ్యనే కిడ్నీ మార్పిడి చేసుకున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించారని నివేదికలు తెలిపాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లాలూ వెంట ఆయన కూతురు మిసా భారతి ఉన్నారు. లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు యాదవ్ కుటుంబానికి, సహచరులకు భూమిని బహుమతిగా లేదా తక్కువ ధరకు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
సోమవారం ఆయన భార్య రబ్రీదేవిని ఇదే కేసులో 5 గంటలకు పైగా విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు తన తండ్రి లాలూ యాదవ్‌ను సీబీఐ విచారణ నేపథ్యంలో ఆయన కూతురు రోహిణి ఆచార్య కీలక హెచ్చరికలు చేశారు. తన తండ్రిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆయనకు ఏమైనా జరిగితే వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. దేనికైనా లిమిట్ ఉంటుందని సహానాన్ని పరిక్షీస్తున్నారని అన్నారు. ఢిల్లీ స్ట్రీట్‌ను వణికించే శక్తి లాలూకు ఉందని చెప్పారు. ఆయనపై చేస్తున్నవన్ని గుర్తుంటాయని, సమయం చాలా శక్తివంతమైనది ట్వీట్ చేశారు.