Lakshadweep : ప్రధాని మోడీ పర్యటనతో ట్రెండింగ్‌లోకి లక్ష్వదీప్

by Mahesh |   ( Updated:2024-01-09 10:06:54.0  )
Lakshadweep : ప్రధాని మోడీ పర్యటనతో ట్రెండింగ్‌లోకి లక్ష్వదీప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రధాని మోడీ లక్ష్వదీప్ పర్యటనలో పాల్గోన్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు అడ్వేంచర్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అలాగే అందమైన లొకేషన్లలో ఫోటోలు కూడా దిగారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఓ బలమైన చర్చ ట్రెండింగ్ లోకి వచ్చింది. దేశంలోని సెలబ్రేటిలు, పర్యటకు ఇలాంటి అందాల కోసం ఎక్కువగా మాల్డీవులకు వెళుతుంటారు. అయితే ప్రధాని మోడీ పర్యటణతో సగానికి ఎక్కవు పర్యటకుల మాల్దీవుల్లో వారు చేసుకున్న బుకింగ్స్ రద్దు చేసుకున్నారు.

ఇది గమనించిన మాల్దీవులకు చెందిన ప్రముఖ ప్రజా ప్రతినిధులు భారతీయులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత సెలబ్రెటీలు ఒక్కసారిగా స్పందించడం మొదలు పెట్టారు. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, సచిన్ టెండూల్కర్‌తో సహా భారతీయ ప్రముఖులు లక్ష్వదీప్, సింధుదుర్గ్ వంటి భారతీయ ద్వీపాలను అన్వేషించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో మాల్దీవులకు చెందిన పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింది.

అక్షయ్ కుమార్ తన ట్వీట్‌లో "మాల్దీవులకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు భారతీయులపై ద్వేషపూరిత , జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. వారికి అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపే దేశానికి వారు ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉంది. మన పొరుగు వారికి మనం మంచి వారమే కానీ మనం ఎందుకు చేయాలి? అలాంటి రెచ్చగొట్టే ద్వేషాన్ని సహించాలా? నేను మాల్దీవులను చాలాసార్లు సందర్శించాను. ఎల్లప్పుడూ దానిని మెచ్చుకున్నాను. దాని కంటే గౌరవం చాలా ముఖ్యం. మనం మన సొంత పర్యాటకానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందాం." అని రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed