టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో లేడీ టీచర్ అసభ్య చాటింగ్.. తల్లిదండ్రులకు తెలియడంతో..!

by Anjali |
టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో లేడీ టీచర్ అసభ్య చాటింగ్.. తల్లిదండ్రులకు తెలియడంతో..!
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు మంచి చదువు, సత్ప్రవర్తన నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలే.. వారి పట్ల వంకరబుద్ధిని చూపింది. మాయమాటలతో మైనర్ బాలుడ్ని లొంగదీసుకొని అసభ్యంగా ప్రవర్తించింది. చివరకు విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ టీచర్ కటకటాలపాలైంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉప్పిలియాపురానికి చెందిన 40 ఏళ్ల దేవి అనే మహిళ ఓ స్కూళ్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. స్కూల్ ముగిశాక, ఇంటి వద్ద సాయంత్రం టెన్త్ క్లాస్ విద్యార్థులకు ట్యూషన్ కూడా చెప్పేది. ఈ క్రమంలోనే ట్యూషన్ కోసం వచ్చిన ఓ విద్యార్థిపై ఆమె కన్నేసింది. మాయమాటలతో స్టూడెంట్‌ను లొంగదీసుకుంది. అతనితో అసభ్యంగా చాటింగ్ చేస్తూ రెచ్చగొట్టింది. చివరకు ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేయగా, మొబైల్ చాటింగ్ నిజమని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.

Advertisement

Next Story