- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Monalisa: కుంభ మేళా సెన్సేషన్ మోనాలిసా.. పది రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిందా..?

దిశ, వెబ్ డెస్క్ : కుంభ మేళ ( Kumbh Mela ) ఎంత ఫేమస్ అయిందో అంతకి మించి అక్కడ పూసలు అమ్ముకునే ఓ యువతీ కూడా అంతే ఫేమస్ అయింది. ఎంతలా అంటే ఏ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ఓపెన్ చేసిన ఈమెకి సంబంధించిన వీడియోలే ముందు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ఆమె పేరే వినబడుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయిన వారిలో ఎవరైనా ఉన్నారంటే.. అది ఈమెనే కావొచ్చు.. మోనీ భోంస్లే అలియాస్ మోనాలిసా ( Monalisa ).
కుంభ మేళాలో మోనాలిసా ( Monalisa ) ఫేమస్ అయిందంటే దానికి కారణం మీడియానే. ఒక సాధారణ అమ్మాయి నుంచి టాక్ ఆఫ్ ది కుంభ మేళా గా అయిపోయింది. ఈ బ్యూటీ వైపు ఒకసారి చూస్తే ఆమె అందం మళ్ళీ మళ్ళీ తనవైపు తిప్పుకునేలా చేస్తుంది. అక్కడ ఒకరోజు పూసలు అమ్ముతూ కెమెరాల కంట పడింది. ఇక, అంతే ఆ రోజు నుంచి ఆమెకి అందరూ ఫిదా అయిపోయారు. ఆమె కళ్లు, స్కిన్ టోన్ కు జనాలందరూ ఆకర్షితులయ్యారు. దీంతో ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారింది. సోషల్ మీడియాలో మోనాలిసాకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ తేనే కళ్ళ సుందరి రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అవ్వడంతో చాలా మంది ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ఎగబడ్డారు. అయితే, ఈ హడావుడిలో పడి వెళ్లిన పని మర్చిపోవడంతో ఆమె తండ్రి స్వస్థలానికి పంపేశాడు. అయితే, ఈ సందర్భంగా మోనాలిసా మళ్లీ వచ్చే కుంభ మేళాలో కనిపిస్తానని చెప్పింది. ఈ పది రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిందని కొందరు అంటుండగా.. అయితే, ఈ వార్తను మోనాలిసా ఖండించింది.
" రూ.10 కోట్ల సంపాదిస్తే.. నేను ఇక్కడ ఎందుకు పూసలు అమ్ముకుంటాను? ఇలాంటి తప్పుడు వార్తలు రాయోద్దని, రాసిన మీరెవరూ నమ్మొద్దని " అందర్ని కోరింది. అయితే, ఇదే సమయంలో బాలీవుడ్ ఆఫర్ కూడా రియాక్ట్ అయింది. అవన్నీ పుకార్లే అని చెప్పింది. మరి, మోనాలిసా భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.