KCR మిత్రుడి సంచలన ప్రకటన!

by Nagaya |   ( Updated:2022-11-24 12:14:10.0  )
KCR మిత్రుడి సంచలన ప్రకటన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సౌత్ ఇండియాలో పాగా వేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలనాధులు పావులు కదుపుతున్నారు. మరోసారి కర్ణాటక పీఠంపై కాషాయ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. అయితే కమలనాథుల జోరుకు బ్రేకులు వేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మిత్రుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ ముఖ్యనేత హెచ్ డి కుమారస్వామి తాజాగా సంచలన ప్రకటన చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తే ముస్లిం వ్యక్తిని సీఎంగా, దళితుడు లేదా మహిళకు డిప్యూటీ సీఎంగా చేస్తామని కుమారస్వామి చేసిన ప్రకటన కన్నడ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

తెలంగాణ స్ట్రాటజీ కర్ణాటకలో అమలు?

జేడీయూ నేత కుమార స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాలపై ఇద్దరు కలిసి ముందుకు సాగుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా అనౌన్స్ చేసిన కార్యక్రమానికి సైతం కుమార స్వామి హాజరయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రచారకర్తగా కేసీఆర్ ఉంటారని ఇటీవలే కుమారస్వామి ప్రకటన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన ముస్లిం సీఎం అభ్యర్థి ప్రకటన విషయం తెలంగాణ మోడల్ తో పోల్చి చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ సైతం ఇలాంటి వాదంతోనే ఎన్నికల్లోకి వెళ్లారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి దళిత వ్యక్తినే ఉంటారని ప్రకటించారు. కానీ అదంతా వట్టి ప్రచారమేనని రియాల్టీలో మరోలా ఉంటుందని కేసీఆర్ నిరూపించారు. దళిత ముఖ్యమంత్రికి బదులుగా తానే సీఎం పీఠంపై కూర్చోవడం తీవ్ర విమర్శలకు కారణం అయింది, అవుతోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ మిత్రుడిగా చెప్పుకుంటున్న కుమార స్వామి సైతం తాజాగా సీఎంగా మైనారిటీ వ్యక్తిని, డిప్యూటీ సీఎంగా దళిత వ్యక్తిని లేదా మహిళను ఎంచుకుంటామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

తాజా నిర్ణయం ఎవరికి నష్టం.. ఎవరికి లాభం?

అధికారంలోకి రావడమే లక్ష్యంగా జేడీఎస్ పంచరత్న యాత్ర ప్రారంభించింది. ఈ యాత్రలో భాగంగా కుమార స్వామి మాట్లాడుతూ ముస్లింలు కూడా సమాజంలో అంతర్భాగమేనన్నారు. వారు కూడా కన్నడిగులేనని మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడిని సీఎంగా ఎన్నుకోవడంలో తప్పు లేదని చెప్పారు. జేడీఎస్ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రైతులకు అవకాశాలు కల్పించడం వంటి అజెండాతో వెళ్తున్న ఏకైక పార్టీ తమదేనన్నారు. కర్ణాటకలో చాలా కాలంగా కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న ముస్లిం వ్యక్తులకు సీఎం పదవీ ఇవ్వలేదని ఈ సారి కుమారస్వామి ఆ ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు స్పష్టం చేశారు. కుమార స్వామి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మైనార్టీ ఓట్లు బీజేపీకి పెద్దగా రావన్నది బహిరంగ రహస్యంగా ఉన్న వాదన.

ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కర్ణాటకలో మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైపు మైనార్టీలు, దళితులు మళ్లకుండా ఆ సామాజిక వర్గాల ఓట్లను తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే కుమార స్వామి ఈ కొత్త ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చారని ఫలితంగా బీజేపీ వర్సెస్ జేడీయూ మధ్య టఫ్ ఫైట్ క్రియేట్ చేయవచ్చనేది కుమార స్వామి ఆలోచన అయి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ ను గేమ్ నుంచి లేకుండా చేయాలనే కుట్రలో భాగం అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ టీపీసీసీతో పాటు ముఖ్య నేతలు ఇదే మాటను పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ అనవసర వివాదాలను సృష్టించుకుంటూ కాంగ్రెస్ ను ఫేడ్ ఔట్ చేసే కుట్ర చేస్తున్నారని వాదిస్తున్నారు. అయితే కేసీఆర్ ఇక్కడి ప్లాన్ ను కర్ణాటకలోని తమ స్నేహితుడి ద్వారా అమలు చేయిస్తున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఎంఐఎంకు కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. గతంలో కర్ణాటక మున్సిపల్ ఎలక్షన్ లో ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇలాంటి నేపథ్యంలో కుమార స్వామి తీసుకున్న నిర్ణయం ఎవరికి లాభం మరెవరికి నష్టం అనేది ఆసక్తి రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed