- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీకే శివకుమార్కు గుడ్ న్యూస్.. !
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ముఖ్యమంత్రి రేస్ లో ఉన్న కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో బుధవారం తాత్కాలిక ఊరట లభించింది. అక్రమాస్తుల కేసు విచారణలో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను జూలై 14 కు వాయిదా వేసింది. శివ కుమార్ ఆస్తులపై ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీబీఐ తనకు పదే పదే నోటీసులు జారీ చేస్తోందని డీకే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణపై కర్ణాటక హైకోర్టు స్టే విధించించించి. అనేక సార్లు స్టే పొడిగించడంతో సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కారోల్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. డీకే శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. మే 23వ తేదీన ఇందుకు సంబంధించిన కేసు హైకోర్టు ముందుకు రానుందని అందువల్ల సీబీఐ పిటిషన్ వాయిదా వేయ్యాలని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరారు. దీంతో సీబీఐ వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది.
Also Read..
కర్నాటక సీఎం ఎవరో ఇంకా ఖన్ఫామ్ కాలే: సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు