Kolkatha Rape Case: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై స్పందించిన సుప్రీంకోర్టు

by Ramesh Goud |
Kolkatha Rape Case: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై స్పందించిన సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోల్‌కతా వైద్యురాలి ఘటనను భారత అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరపనుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ‌కర్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్యా ఘటనపై సుప్రీంకోర్టు స్పందించాలని పలువురు పిటీషన్లు దాఖలు చేశారు. ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని ప్రాక్టీస్ లాయర్లు ఉజ్వల్ గౌర్, రోహిత్ పాండేలు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ కి లెటర్ పిటీషన్ పంపారు. దీనిపై స్పందించిన సుప్రీం ఘటనను సుమోటాగా తీసుకుంది. దీనిపై జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసం విచారణ చేపట్టనుంది. ఈ కేసు మంగళవారం 10.30 గంటలకు బెంచ్ వద్ద విచారణకు రానుంది.

కాగా కొద్ది రోజుల క్రితం కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనలో భాదితురాలికి న్యాయం చేయాలని, బాధ్యులైన వారికి శిక్ష పడేలా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై దేశంలోని డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శనివారం 24 గంటల పాటు వైద్యసేవలు నిలిపివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ పలువురిని అరెస్ట్ చేసి, విచారణ జరుపుతోంది.




Advertisement

Next Story

Most Viewed