Kolkata Murder Case : నిరసనల వెనుక కేంద్రం కుట్ర ఉందనడం సిగ్గుచేటు.. సీఎం మమతపై బీజేపీ ఫైర్

by Hajipasha |
Kolkata Murder Case : నిరసనల వెనుక కేంద్రం కుట్ర ఉందనడం సిగ్గుచేటు.. సీఎం మమతపై బీజేపీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను బీజేపీ నేత షెహజాద్ పూనావాలా సోమవారం ఖండించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలు సిగ్గుచేటని.. మెడికల్ కాలేజీలో జరిగిన దురాగతానికి బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

‘‘జూనియర్ వైద్యురాలిపై జరిగిన దారుణ ఘటనకు టీఎంసీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించకపోగా.. ప్రజా నిరసనల వెనుక కుట్ర ఉందంటూ అర్థం లేని వాదనలను తెరపైకి తెస్తోంది. ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదులో 14 గంటలు ఆలస్యం చేశారని సోమవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతమాత్రాన ఈ కుట్రలో సుప్రీంకోర్టు కూడా భాగమని చెబుతారా ? సీఎం పదవిలో కొనసాగే అర్హత మమతకు లేదు’’ అని షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed