- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DY Chandrachud: తన శాఖాహార జీవనశైలి గురించి వివరించిన సీజేఐ డీవై చంద్రచూడ్
దిశ, నేషనల్ బ్యూరో: దివ్యాంగులు నిర్వహణలో నడిచే ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులైన తన ఇద్దరు కుమార్తెలు ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉన్నవారని, తన పనితీరులో వారి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా శాకాహార జీవనశైలిని అవలంబించాలనే తన నిర్ణయం క్రూరత్వం లేని జీవితాన్ని గడపాలని తన కుమార్తె సమర్థించడం ద్వారా వచ్చిందని పేర్కొన్నారు. అందులో భాగంగా తాను, తన భార్య పట్టు లేదా తోలు ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దివ్యాంగులతో తన రోజువారీ సంభాషణ వారిలోని అద్భుతమైన సామర్థ్యాన్ని బహిర్గతం చేస్తాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఆవరణలో ప్రారంభమైన మిట్టి కేఫ్ వంటివి కొత్త ఆలోచనలకు పునాది లాంటివని, న్యాయ సంఘాల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందాయని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రతి హైకోర్టులో ఇలాంటి కేఫ్‌లు ఏర్పాటు చేసేలా అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాయనున్నట్టు చంద్రచూడ్ ప్రకటించారు. న్యాయ వ్యవస్థలో భిన్నమైన వ్యక్తులను కలుపుకొని పోవడానికి, మద్దతు ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా జిల్లా కోర్టులకు కూడా ఇలాంటి కార్యక్రమాలు విస్తరించే ప్రతిపాదన చేయనున్నట్టు పేర్కొన్నారు.