ఉత్తర కొరియా అధినేత కిమ్ సంచలన నిర్ణయం

by Shamantha N |   ( Updated:2024-07-14 11:16:42.0  )
ఉత్తర కొరియా అధినేత కిమ్ సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పలువురు ఉన్నతాధికారులను విధుల నుంచి తొలగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఉత్తర కొరియాలోని నిర్మాణాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని వేటు వేసినట్లు పేర్కొంది. కొత్త అపార్ట్‌మెంట్‌లు, హోటళ్లు, సీ రిసార్ట్, వాణిజ్య, సాంస్కృతిక, వైద్య సదుపాయాలతో సామ్‌జియోన్‌లో ‘సోషలిస్టు ధామం’ నిర్మాణం చేపట్టారు. అయితే, ఈ ప్రాజెక్టును సందర్శించిన కిమ్.. అధికారలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉండటం వల్లే నాసిరకంగా పనులు జరిగాయని మండిపడ్డారు. ఆర్థిక నష్టం జరిగిందని వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

అధికారులను సస్పెండ్ చేసిన కిమ్

స్థానిక మంత్రిగా నియమించిన రి సన్ చోల్‌ డిసెంబర్ నుంచి ఒక్కసారి కూడా ఈ పనులను పర్యవేక్షించలేదని కిమ్ ఫైర్ అయ్యారు. విచారణకు రావాల్సిందగా ఆయన్ని ఆదేశించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని తనిఖీ చేసే కమిటీ సభ్యులందరినీ కిమ్‌ సస్పెండ్ చేశారు. పర్యాటకుల కోసం కొత్తగా నిర్మించిన హోటళ్లను సందర్శించిన కిమ్‌ వాటి నిర్మాణంలో వినూత్నంగా లేదని.. పాత పద్ధతిలో నాసిరకంగా నిర్మాణాలు చేపట్టారని ఆసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిలో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed