Kidnap: ఢిల్లీ - మీరట్ హైవే‌పై సంచలనం.. నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్

by Shiva |
Kidnap: ఢిల్లీ - మీరట్ హైవే‌పై సంచలనం.. నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌ (Bollywood)లో వెల్‌కం (Welcome), స్ట్రీట్-2 (Street-2) మూవీల్లో ప్రధాన పాత్రలు పోషించిన నటుడు ముస్తాక్ ఖాన్‌ (Mushtaq Khan)ను దుండగులు కిడ్నాప్ చేశారు. గత నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఓ అవార్ట్ ఫంక్షన్‌కు మీరట్ (Meerat) వెళ్లేందుకు ముస్తాక్ ఖాన్ (Mushtaq Ali) సిద్ధమయ్యాడని అతడి బిజినెస్ పార్ట్‌నర్ శివమ్ తెలిపాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)కు చెరుకోగానే కొందరు ముస్తాక్‌ను కారులో బలవంతంగా ఎక్కించారని పేర్కొన్నాడు.

అనంతరం కిడ్నాపర్లు నేరుగా ఢిల్లీ (Delhi) శివారులోని బిజ్నోర్ (Bijnor) సమీపంలోకి అతడిని తీసుకెళ్లి 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారని, అదేవిధంగా రూ.కోటి డిమాండ్ చేశారని తెలిపాడు. ఇక ముస్తాక్ ఖాన్, అతడి బ్యాంక్ ఖాతాల నుంచి సుమారు రూ.2 లక్షల వరకు నగదును కాజేశారని అన్నారు. మరోసటి రోజు తెల్లవారుజామున ముస్తాక్ తెలివిగా కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డాడని శివమ్ తెలిపాడు. జరిగిన ఘటనపై తాము ఇప్పటికే బిజ్నోర్ (Bijnor) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారని శివమ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed