Kharge: కాంగ్రెస్ నేతలకు ఖర్గే స్వీట్ వార్నింగ్

by Gantepaka Srikanth |
Kharge: కాంగ్రెస్ నేతలకు ఖర్గే స్వీట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ఏడాది ముందే గ్రౌండ్‌లోకి దిగాలని అన్నారు. ఇక నుంచి పాత పద్ధతులు అనుసరిస్తే గెలవలేమని చెప్పారు. గత ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. కోట్లాది మంది కాంగ్రెస్‌(Congress)కు అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దానిని మనం సద్వినియోగం చేసుకోలేకపోవడానికి కారణాలేంటో వెతకాలని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడం ఇప్పుడు చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. నేతల పరస్పర విరుద్ధ ప్రకటనలతో పార్టీకే నష్టం అని అన్నారు. ఐక్యంగా లేకపోతే ప్రత్యర్థులను రాజకీయంగా ఓడించడం కష్టంగా ఉంటుందని తెలిపారు. కఠిన క్రమశిక్షణ అవసరమన్నారు.

కలిసికట్టుగా పోరాడకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తగదని తెలిపారు. ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు. అదే మన బలం అని సూచించారు. పార్టీ విజయమే తమ గెలుపు అని ప్రతిఒక్కరూ అనుకోవాలని చెప్పారు. పార్టీ బలంపైనే మన శక్తి ఆధారపడి ఉంటుందని భావించాలని సూచించారు. ఇకనుంచి ఎన్నికల వ్యూహాన్ని కాంగ్రెస్‌ మెరుగుపరుచుకోవాలి. దేశవ్యాప్తంగా ప్రజల ఎజెండాను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story