NEET UG 2024: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్.. నలుగురు డాక్టర్లు అరెస్ట్

by Mahesh |
NEET UG 2024: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్.. నలుగురు డాక్టర్లు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు‌కు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా.. తాజాగా పాట్నా ఎయిమ్స్ కు చెందిన నలుగురు డాక్టర్లను బీసీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పేపర్ లీక్ జరగడంలో వీరు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. పేపర్ లీక్ ఇష్యూతో దాదాపు 15 వందల మంది విద్యార్థులను గ్రేస్ మార్కులను రద్దు చేసిన ఎన్టీయే వారికి తిరిగి పరీక్ష కూడా నిర్వహించింది. కానీ కొంతమంది మాత్రం పూర్తిగా నీట్ యూజీ 2024 పరిక్షను రద్దు చేసి కొత్తగా నిర్వహించాలని దేశవ్యాప్తంగా కోర్టులను ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. పరీక్ష కేంద్రాల పరంగా ఫలితాలు వెబ్ సైట్ లో ఉంచాలని ఎన్డీయేకు సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.



Next Story