ఢిల్లీ జిమ్ ట్రైనర్ హత్య కేసు.. బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్

by Y.Nagarani |
ఢిల్లీ జిమ్ ట్రైనర్ హత్య కేసు.. బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ జిమ్ ట్రైనర్ హత్యకేసు (delhi gym trainer murder case) లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిష్ణోయ్ గ్యాంగ్ లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, మథుర పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆగ్రా - మథుర హైవేపై పోలీసులకు.. లారెన్స్ బిష్ణోయ్ - హషీమ్ బాబా గ్యాంగ్ సభ్యుడైన యోగేష్ (Yogesh Arrest)కు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో యోగేష్ కాలికి బుల్లెట్ గాయం అవ్వడంతో అక్కడే కుప్పకూలాడు. వెంటనే పోలీసులు యోగేష్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, మథుల పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో యోగేష్ అరెస్టయ్యాడు. సెప్టెంబర్ 12న యోగేష్.. ఢిల్లీలోని జిమ్ నిర్వాహకుడు నాదిర్ షా ను కాల్చి చంపాడు.

Advertisement

Next Story

Most Viewed