కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠ్యాంశంగా ‘పోక్సో’ చట్టం..

by Vinod kumar |
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠ్యాంశంగా ‘పోక్సో’ చట్టం..
X

తిరువనంతపురం: లైంగిక నేరాలు, వాటి పర్యవసానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విషయంలో కేరళ ప్రభుత్వం ముందడుగు వేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచే "పోక్సో చట్టం"పై లెస్సన్స్ ను స్కూల్ సిలబస్‌లో చేరుస్తామని వెల్లడించింది. 2022 జూన్ 8న ఓ కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని కేరళ స్టేట్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎస్సీఈఆర్టీ) తాజాగా సోమవారం హైకోర్టుకు తెలియజేసింది. పోక్సో చట్టానికి తగిన ప్రాధాన్యం కల్పిస్తూ.. పాఠ్య పుస్తకాలను సిద్ధం చేసే పనిలో విద్యారంగ నిపుణులు నిమగ్నమై ఉన్నారని పేర్కొంది. ఈ చర్యలను మౌఖికంగా అభినందించిన కేరళ హైకోర్టు.. ఇలా చేయడంతో విద్యార్థులకు అవగాహన కల్పించడంలో కేరళ తొలిస్థానంలో నిలుస్తుందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed