- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆన్‌లైన్ చిట్కాలతో ప్రాణాలు పోగొట్టుకున్న యువతి.. వెయిట్ లాస్ కావాలని ఆహారం మానేసి..

దిశ, నేషనల్ బ్యూరో: బరువు పెరగడం(Weight Gain) సులువు.. తగ్గించాలంటే చెమట చిందించాలి. అందుకే బరువు పెరుగుతున్నామంటే ఆందోళనా పెరుగుతుంది. నేడు ఎక్కువ మంది ఒబెసిటీతో బాధపడుతున్నారనేది వాస్తవం. కానీ, కొందరు అండర్‌వెయిట్ ఉన్నప్పటికీ ఓవర్‌వెయిట్‌గా భ్రమపడుతారు. దీన్నే అనోరెక్సియా నెర్వోసా అనే ఈటింగ్ డిజార్డర్(Eating Disorder)గా పిలుస్తారు. వీరు బక్కచిక్కినట్టుగా ఉన్నప్పటికీ తాము బరువు పెరుగుతున్నామనే ఆందోళనలో ఉంటారు. అందుకే బరువు తగ్గించుకోవడానికి చిట్కాల కోసం చూస్తుంటారు. అరచేతిలో ఉన్న ఇంటర్నెట్ సౌకర్యంపై ఆధారపడుతూ ఉంటారు. ఇలా ఆధారపడే కేరళ యువతి ప్రాణాలు పోగొట్టుకున్నది. బరువు తగ్గించుకోవాలని ఎక్స్‌ట్రీమ్ డైటరీ ప్లాన్ చేసుకుంది. కొన్నాళ్లపాటు కేవలం వేడి నీటిపైనే గడిపింది. పేరెంట్స్ పెడుతున్న భోజనాన్నీ తినలేదు. ఆ విషయం వారికి తెలియకుండా జాగ్రత్త పడింది. ఫలితంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆ యువతి కేవలం 24 కిలోల బరువుకు తగ్గిపోయింది. అనారోగ్యంతో మంచం పట్టింది. అప్పటికే ఓ సారి హాస్పిటల్ తీసుకెళ్లితే హాస్పిటల్ తీసుకెళ్లితే సరిగా భోజనం తినేలా చూసుకోండని సలహా ఇచ్చారు. రెండోసారి ఆమె పరిస్థితి దారుణంగా దిగజారిపోవడంతో హాస్పిటల్‌లో నేరుగా ఐసీయూలోనే అడ్మిట్ చేసుకున్నారు. పన్నెండు రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. కానీ, చివరికి ఆమె ప్రాణాలు నిలవనేలేదు.
కేరళ కన్నూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల శ్రీనంద వెయిట్ లాస్ కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ చిట్కాలు పాటించి ప్రాణాలు పోగొట్టుకుంది. బరువు పెరుగుతున్నాననే ఆందోళనతో ఐదారునెలలు ఆమె భోజనం తగ్గిస్తూ తీవ్రంగా ఎక్సర్‌సైజులు చేస్తూ.. హాట్ వాటర్ తగుతూ గడిపింది. అనారోగ్యానికి గురికావడంతో కోళికోడ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లగా ఆమెకు ట్రీట్‌మెంట్ చేసి ఫుడ్ తీసుకునేలా చూసుకోవాలని పేరెంట్స్‌కు సజెస్ట్ చేశారు. కానీ, ఆ తర్వాత కూడా యువతి తల్లిదండ్రులను నమ్మించి తినకుండానే గడిపింది. ఫలితంగా ఆమె ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. మంచానికి పరిమితమైంది. ఈ సారి తలసేరీ హాస్పిటల్ తీసుకెళ్లగా.. ఆమెను డైరెక్ట్‌గా ఐసీయూలోకి తీసుకోవాల్సి వచ్చింది. 12 రోజుల క్రితం క్రిటికల్ కండీషన్‌లో శ్రీనందను తీసుకురాగా, రెండు రోజుల క్రితం ఆమె బ్లడ్ షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సపోర్ట్ పై ఉంచినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదని, చివరికి తుదిశ్వాస విడిచిందని వివరించారు.