- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోప్, పీఎం ఫోటో వివాదంలో కేరళ కాంగ్రెస్ క్షమాపణలు.. అసలేం జరిగిందంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: పోప్ ఫాన్సిస్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో విషయంలో కేరళ చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. బీజేపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. తాము చేసిన పోస్ట్ పై క్రైస్తవ సమాజానికి క్షమాపణలు చెప్పింది. ఇటీవల ఇటలీలో జరిగిన జీ-7 దేశాల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ఆయన పోప్ ఫ్రాన్సిస్ ను కలిశారు. పోప్ ను మోడీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను కేరళ కాంగ్రెస్ ఆదివారం సోషల్ మీడియా ఫ్లాట్ పై పై షేర్ చేస్తూ "చివరిగా, పోప్‌కు దేవుడిని కలిసే అవకాశం వచ్చింది" అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కేరళ కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ప్రధాని నరేంద్ మోడీని జీసస్ తో సమానం అనే అర్థం వచ్చేలా కాంగ్రెస్ వ్యాఖ్యలు ఉన్నాయని.. ఈ వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించడమేనని మండిపడింది. ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోవడం సిగ్గుచేటని, కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు జార్జ్ కురియన్, కేరళ బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ తో పాటు పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కేరళ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఏ మతాన్ని, మత గురువులను, విగ్రహాలను అవమానించడం, కించపరచడం భారత జాతీయ కాంగ్రెస్ సంప్రదాయం కాదని ఈ దేశ ప్రజలందరికీ తెలుసు అని పేర్కొంది. అన్ని మతాలు, విశ్వాసాలను కలుపుతూ స్నేహపూర్వక వాతావరణంలో ముందుకు నడిచే పార్టీ కాంగ్రెస్ అని, క్రైస్తవులు గౌరవంగా చూసే పోప్‌ను అవమానించడం గురించి ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆలోచించడని వివరణ ఇచ్చింది. ఈ పోస్ట్ క్రైస్తవులకు ఏదైనా మానసిక లేదా మానసిక క్షోభ కలిగించినట్లయితే మేము నిస్సందేహంగా క్షమాపణలు కోరుతున్నామని ప్రకటన చేసింది. అయితే, తనను తాను దేవుడని చెప్పుకుంటూ ఈ దేశ విశ్వాసులను అవమానిస్తున్న నరేంద్ర మోడీని విమర్శించడంలో కాంగ్రెస్ కు ఎలాంటి సంకోచం లేదని పేర్కొంది.