ట్రిపుల్ తలాక్‌ ఎందుకు నేరం..? సీఎం సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
ట్రిపుల్ తలాక్‌ ఎందుకు నేరం..? సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ సీఎం పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పు పడుతున్న ట్రిపుల్ తలాక్‌ను ఆయన సమర్ధించారు. సోమవారం తిరువనతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం రారజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. అన్ని మతాల్లోనూ విడాకులు జరుగుతున్నప్పుడు ట్రిపుల్ తలాక్‌ను ఎందుకు నేరంగా పరిగణిస్తున్నారని విజయన్ ప్రశ్నించారు. అన్ని మతాల్లో విడాకులు సివిల్ కేసులుగా పరిగణిస్తుంటే ఒక్క ముస్లింల విషయంలో మాత్రమే ఇది ఎందుకు క్రిమినల్ నేరంగా పరిగణిస్తున్నారని నిలదీశారు.

మనం అంతా తొలుత భారతీయులం అని ఫలానా మతంలో పుట్టినందుకు పౌరస్వతం వచ్చిందని చెప్పగలమా అని ప్రశ్నించారు. పౌరసత్వానికి మతం ఎప్పుడైనా ప్రాతిపదికగా ఉందా అని అన్నారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేరళలో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై దేశ ఉపరాష్ట్రపతి, న్యాయశాఖ మంత్రి దాడి చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed