- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేరళ’ కాదు.. ‘కేరళం’!
దిశ, నేషనల్ బ్యూరో : కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఆరాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ సభలో సోమవారం ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. దీంతో ఆ తీర్మానం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కాకపోతే, సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిపక్షాలు కొన్ని సవరణలను ప్రతిపాదించాయి. పేరు మార్పునకు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వరలో కేంద్రానికి పంపనున్నారు.
గతంలో ఈ తీర్మానాన్ని తిరస్కరించిన కేంద్రం
గతేడాది ఆగస్టు 9న కూడా కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరారు. అయితే ఈ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఇప్పుడు మరోసారి రాజ్యాంగంలోని ఎనిమిదో జాబితాలో పేరు మార్పు విషయాన్ని చేర్చాలనే తీర్మానాన్ని కేరళప్రభుత్వం కేంద్రానికి పంపింది.