ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన CM కేజ్రీవాల్..!

by Satheesh |
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన CM కేజ్రీవాల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించింది. ఈ పిటిషన్‌పై జడ్జిమెంట్‌ను రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై స్టే కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను తాజాగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed