ఈడీ విచారణకు మూడోసారీ కేజ్రీవాల్ డుమ్మా: నోటీసులు ఇల్లీగల్ అంటూ ఆప్ కామెంట్

by samatah |   ( Updated:2024-01-03 06:34:31.0  )
ఈడీ విచారణకు మూడోసారీ కేజ్రీవాల్ డుమ్మా: నోటీసులు ఇల్లీగల్ అంటూ ఆప్ కామెంట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ బుధవారం ఈడీ ఇన్వెస్టిగేషన్‌కు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన అటెండ్ అవడం లేదని ఆప్ వర్గాలు తెలిపాయి. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని ఆప్ ఆరోపించింది. ఈడీకి సహకరించడానికి కేజ్రీవాల్‌ సిద్ధంగా ఉన్నారని కానీ.. కేవలం అరెస్టు చేసే ఉద్దేశంతోనే నోటీసులు పంపారని పేర్కొంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొనకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించింది. కాగా, గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21న ఈడీ రెండు సార్లు కేజ్రీవాల్‌కు సమన్లు పంపగా..అప్పుడు కూడా విచారణకు హాజరుకాలేదు. తాజాగా మూడోసారి సైతం సమన్లను పక్కన బెట్టడం గమనార్హం. అయితే ఇదే కేసులో గతేడాది ఏప్రిల్‌లో సీబీఐ 9 గంటల పాటు కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం ఏదో దాస్తున్నారని అందుకే విచారణకు డుమ్మా కొడుతున్నాడని ఆరోపించారు. మరోవైపు ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed