ఆయన చేస్తుంది దేశానికి మంచిది కాదు.. మోడీపై కేజ్రీవాల్ విమర్శలు

by Shamantha N |   ( Updated:2024-04-02 12:41:15.0  )
ఆయన చేస్తుంది దేశానికి మంచిది కాదు.. మోడీపై కేజ్రీవాల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను రౌజ్ అన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టుకు వస్తున్న సమయంలో మీడియా కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగగా... ప్రధాని మోడీ చేస్తోంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ మండిపడ్డారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కేజ్రీవాల్ ను మార్చి 22న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అప్పుడు వారంపాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆగడువు మార్చి 22న ముగియడంతో.. మరోసారి మూడు రోజుల కస్టడీ విధించింది. కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను కోర్టుకు తీసుకొచ్చారు. స్పెష‌ల్ జ‌డ్జి కావేరి బ‌వేజా ఎదుట కేజ్రీవాల్ ను హాజరుపరిచారు. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. తీహార్ జైలుకే కేజ్రీవాల్ ను పంపాలని ఆదేశించింది. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఆ పిటషన్ పై ఏప్రిల్ 2న విచారణ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed