Kejriwal: కాలుష్యాన్ని నియంత్రించేందుకే క్రాకర్స్ బ్యాన్.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్

by vinod kumar |
Kejriwal: కాలుష్యాన్ని నియంత్రించేందుకే క్రాకర్స్ బ్యాన్.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు మాత్రమే దీపావళి పండుగకు టపాసులు కాల్చడంపై నిషేధం విధించామని ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) స్పష్టం చేశారు. ఈ విషయం హిందూ(Hindu), ముస్లిం(muslim), ఇతర మతాలకు సంబంధించినది కాదని తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దీపావళి అంటే వెలుగుల పండుగ అని, కానీ బాణాసంచా కాల్చడం వల్ల కలిగే కాలుష్యాన్ని (Pollution) పిల్లలు భరించాల్సి వస్తోందన్నారు. ప్రతి ఒక్కరిపై దాని ప్రభావం ఉంటుందన్నారు. పండుగ నిజమైన ఆత్మ కాంతిని వ్యాపింపజేయడంలో మాత్రమే ఉందన్నారు. కానీ సంప్రదాయం కంటే ప్రజల ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

‘కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పటాకులు కాల్చకూడదని సుప్రీంకోర్టు(Supreme court), హైకోర్టు (Hign court)లు కూడా సూచిస్తున్నాయి. దీపావళి వెలుగుల పండుగ. కాబట్టి బాణాసంచా పేల్చకుండా, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి పండుగ జరుపుకుందాం. పటాకులు పేల్చడం వల్ల కాలుష్యం ఎక్కువవుతుంది. దాని ప్రభావం మనపైనే పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. మన కోసం మనమే మందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హిందూ, ముస్లిం తేడా లేకుండా ఆందరి శ్వాస, అందరి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పారు. కాగా, ఢిల్లీలో బాణాసంచా కాల్చడంపై ఆప్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story