దేశంలో అత్యధిక కేసులు కలిగిన సీఎం కేసీఆరే!

by Javid Pasha |   ( Updated:2023-04-12 15:17:47.0  )
దేశంలో అత్యధిక కేసులు కలిగిన సీఎం కేసీఆరే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అత్యధిక సంపన్నుల ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరవ స్థానంలో నిలిచారు. కేసీఆర్ కు మొత్తం 23 కోట్ల ఆస్తులు ఉండగా, అత్యధిక అప్పులు కలిగిన సీఎంలలో టాప్ లో ఉన్నారు. కేసీఆర్ కు 8 కోట్ల అప్పులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్- ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ ఈడబ్ల్యూ) అనే సంస్థలు విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం జగన్ (రూ.510 కోట్లు) నిలిస్తే.. అతి తక్కువ ఆస్తి కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో మమతా బెనర్జీ (రూ.15 లక్షలు)తో మొదటి స్థానంలో నిలిచారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం కేసీఆర్ ఆస్తి విలువ రూ.23.55 కోట్లుగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

భారత్ లోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు (ఢిల్లీ, పుదుచ్చెరి) సీఎంల ఆస్తుల విశ్లేషణను చేశారు. 30 మంది సీఎంలలో 43 శాతం సీఎంలపై తీవ్రమైన నేరాల (హత్య, హత్యాయత్నం, కిడ్నాప్,బెదిరింపు)కు సంబంధించిన కేసులు ఉన్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇవన్నీ బెయిల్ కు వీలులేని ఐదేళ్ల కన్నా ఎక్కువ శిక్షపడే అవకాశాలున్న కేసులేనని తాజా నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 30 మంది సీఎంలలో 29 మంది ముఖ్యంత్రులు కోటీశ్వరులేనని.. అంటే 97 శాతం మంది కోటీశ్వర్లు ఉండగా 15.57 శాతం మంది సీఎంలకు క్లీన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లు పేర్కొంది. సీరియస్ క్రిమినల్ కేసులు కలిగిన సీఎంలలో కేసీఆర్ టాప్ లో ఉన్నారు. ఇతనిపై మొత్తం 64 కేసులు నమోదు కాగా అందులో 31 సీరియస్ ఐపీసీ కేసులు ఉన్నాయి.

Also Read..

దేశంలో అత్యధిక కేసులు కలిగిన సీఎం కేసీఆరే!

Advertisement

Next Story

Most Viewed