కర్ణాటకలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

by sudharani |   ( Updated:2023-02-13 15:28:35.0  )
కర్ణాటకలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
X

బెంగళూరు: మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారానికి సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ప్రచారాన్ని ప్రారంభించినున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్, సిద్ధరామయ్య సంతకాలతో కూడిన హామీ పత్రాలను అందజేయనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, ఇంటి ఇల్లాలుకు ప్రతినెలా రూ.2,000 భత్యం ఇస్తామని ప్రకటించింది.

దీంతో పాటు బొమ్మై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జిషీటును కూడా పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో అన్ని ఇళ్లను చేరుకునేలా నెల రోజులకు పైగా ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు కర్ణాటక తీర ప్రాంతాల ప్రజలను ఆకర్షించేందుక ఉద్యోగ కల్పన, పెట్టుబడి ఆకర్షణలు, పర్యాటక అభివృద్ధితో కూడిన 10 పాయింట్ల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ అంతకుముందు విడుదల చేసింది.

Also Read..

ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story