వివాదంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్! (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-29 07:20:10.0  )
వివాదంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నిలక షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఫుల్ స్వింగ్‌లో ప్రచారం మొదలు పెట్టగా...అటు కాంగ్రెస్‌ నేతలూ క్యాంపెయినింగ్‌కి రెడీ అయ్యారు. తాజాగా ‘ప్రజాధ్వని యాత్ర’పేరుతో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ శ్రీరంగపట్నలో ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రజలపై కరెన్సీ వర్షం కురింపించారు.

ఆయన ప్రచార వాహనంలో నుంచి రూ.500 నోట్లు ప్రజలపైకి విసిరారు. ప్రజాధ్వని యాత్ర పేరిట ప్రచారం చేస్తున్న ఆయన.. మండ్యా జిల్లాలోని బెవినహళ్లి వద్ద ప్రజలపై నోట్ల వర్షం కురిపించారు. అప్పటి వరకూ ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చిన శివకుమార్, తన కారులోని నోట్లను తీసి ఒక్కసారిగా అందరిపై విసిరారు. అయితే, ఈసారి జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని అధిష్ఠానం బలంగా నమ్ముతోంది.

కాంగ్రెస్ గెలిస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివకుమార్‌ను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో శివకుమార్ నోట్లు విసిరి వివాదాల్లో చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 10 పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed