కేసీఆర్ సైలెంట్.. డీఎంకే అనూహ్య నిర్ణయం

by Mahesh |   ( Updated:2023-04-18 11:14:12.0  )
కేసీఆర్ సైలెంట్.. డీఎంకే అనూహ్య నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని పెంచుతున్నాయి. దక్షిణ భారత దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో పాటు ఇక్కడ మరోసారి విజయం నమోదు చేసుకుని ఆ తర్వాత రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కమలనాధులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పేరుతో నేషనల్ పాలిటిక్స్‌కు ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ మాత్రం కర్ణాటక ఎన్నికల విషయంలో మౌనం పాటించడం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్రమంలో కేసీఆర్ మిత్రుడు తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో డీఎంకే ఎంపీ కనిమొళి కాంగ్రెస్ తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ ఇదే నిజమైతే కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది పెద్ద ముందడుగు అవుతుందనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story