- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్హయ్య కుమార్ దేశ ద్రోహి: బీజేపీ నేత మనోజ్ కుమార్
దిశ, నేషనల్ బ్యూరో: నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ పై అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత మనోజ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కన్హయ్య దేశానికి ద్రోహం చేశాడని ఆరోపించారు. కాబట్టి ప్రజలు అతన్ని తరమికొడతారని విమర్శించారు. ఢిల్లీలో శనివారం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీని ఎన్నుకునేందుకు దేశ ప్రజలు మరోసారి సిద్ధమయ్యారని తెలిపారు. అనేక సమస్యల నుంచి బయటపడేందుకు ఢిల్లీ ప్రజలకు మంచి అవకాశమని చెప్పారు. దేశం అభివృద్ధి చెందున్నప్పుడు సవాళ్లు ఏముంటాయని కన్హయ్యను ప్రశ్నించారు. కన్హయ్యకు కాంగ్రెస్ పార్టీలోనే అనేక సవాళ్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోడీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 2014, 2019తో పోల్చితే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, మనోజ్ తివారీ గత రెండు ఎన్నికల్లో నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలుపొందారు. కన్హయ్య కుమార్ 2019లో బిహార్ లోని బెగూసరాయ్‌లో సీపీఐ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.