- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kangana: రాహుల్‌గాంధీ నాయకుడు కాదు.. బాధితుడు: నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. నిత్యం నాయకులు ఒకరిపై మరొకరు సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్న నటి కంగనా రనౌత్ రాహుల్‌గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని బలవంతంగా, ఇష్టం లేకపోయినా రాజకీయాల్లో తీసుకొచ్చారని ఆరోపించారు.
ఆమె కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి అతడు బలైపోయాడని.. అందుకే రాహుల్ గాంధీ నాయకుడు కాదు.. బాధితుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వరుస విజయాలతో రాహుల్ బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడంటూ కామెంట్ చేశారు. ఇప్పటికే అతడికి 50 ఏళ్లు వచ్చాయని, మరికొన్నాళ్లు పోతే 60 ఏళ్లు వస్తాయంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే చాలా సార్లు రాజకీయాల్లో అతడు విఫలమైనా.. యంగ్ లీడర్ అంటూ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ పదే పదే రీలాంచ్ చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. అందుకే తాను రాహుల్ గాంధీని రాజకీయ బాధితుడిగానే భావిస్తున్నా అంటూ కంగనా రనౌత్ అన్నారు.