- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జల్లికట్టుపై కమల్ హాసన్ సంచలన ప్రకటన..!
దిశ, డైనమిక్ బ్యూరో: విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సంక్రాంతికి మక్కల్ నీది మయ్యం పార్టీ ఆధ్వర్యంలో చెన్నైలో జల్లికట్టు పోటీలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జల్లికట్టు పోటీలు తమిళ సంప్రదాయానికి ప్రతీక అని, పోటీల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోరుతామని శుక్రవారం ప్రకటన చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుమతి ఇస్తుందని నమ్మకంతో ఉన్నామన్నారు. జల్లికట్టుకు తమిళనాడులో చాలా చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సందర్భంగా ఈ ఆటను ఆడేందుకు తమిళ ప్రజలు ఆసక్తి చూపుతారు.
అయితే ఈ జల్లికట్టుపై 2014లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ద్రవిడ పార్టీలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ మేరకు కేంద్రపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచిన కమల్ హాసన్ ఆ తర్వాత ఈ ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది.