బైపోల్ బరిలో హేమంత్ సొరేన్ భార్య

by Swamyn |
బైపోల్ బరిలో హేమంత్ సొరేన్ భార్య
X

దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే వచ్చే నెల 20న గాండే అసెంబ్లీ నియోజకవర్గానికీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి అధికార జార్ఖండ్ ముక్తి మోర్చ(జేఎంఎం) తరఫున కల్పన పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని జేఎంఎం పార్టీ గురువారం ప్రకటించింది. కల్పనకు పోటీగా బీజేపీ దిలీప్ కుమార్‌ను బరిలోకి దించింది. కాగా, జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది.


Advertisement

Next Story