Justin Trudeau: దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రూడో.. భారత్‌తో వివాదం వేళ కీలక పరిణామం

by vinod kumar |
Justin Trudeau: దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రూడో.. భారత్‌తో వివాదం వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్(indi), కెనడా(canada)ల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి భారతీయులు నిర్వహించిన సంబురాల్లో తాను పాల్గొన్నట్టు ఆదివారం ఎక్స్ వేదికగా ట్రూడో వెల్లడించారు. ‘అందరికీ హ్యాపీ దీపావళి. ఈ వారం భారతీయ కమ్యునిటీ(indian community)తో దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాను. ఇవి ఎంతో ప్రత్యేకమైన క్షణాలు’ అని పేర్కొన్నారు. అలాగే ఓ వీడియోను సైతం షేర్ చేశారు. ఆయన చేతికి కట్టుకున్న మతపరమైన దారాలను చూపించారు. ‘గత కొన్ని నెలలుగా కెనడాలోని మూడు వేర్వేరు హిందూ ఆలయాలను(Hindu Temples) సందర్శించాను. ఈ సందర్భంగా నా చేతికి తాళ్లు కట్టారు. వీటిని బహుమానంగా స్వీకరిస్తున్నా. ఇవి అదృష్టం, ఎంతో రక్షణను ఇస్తాయి. అవి తెగిపోయే వరకు వాటిని తొలగించను’ అని తెలిపారు. పలువురు సభ్యులతో ఆయన సరదాగా గడిపిన సందర్భాలు సైతం వీడియోలో ఉన్నాయి. అంతకుముందు అక్టోబర్ 31న ట్రూడో కెనడియన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి, ఈ వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత ప్రభుత్వానికి సంబంధమున్నట్టు ఆధారాలు ఏవీ లేవని తెలిపింది.

Advertisement

Next Story