- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జడ్జి వర్సెస్ జడ్జి వ్యవహారం .. ఆ కేసులో న్యాయ విచారణ ఆపండి: సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సౌమెన్ సేన్‌పై అదే కోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన అధికార దుర్వినియోగం ఆరోపణలపై సుప్రీంకోర్టులో శనివారం విచారణ జరిగింది. బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయమూర్తి సౌమెన్ సేన్ తీర్పులు ఇస్తున్నారనే అభియోగాలకు సంబంధించిన పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులకు నకిలీ కులం సర్టిఫికెట్లను జారీ చేశారనే అంశంపై తీర్పులిచ్చే విషయంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏర్పడిన వైరుధ్యాల వివరాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం సమీక్షించింది. ఈ వ్యవహారంలో కోల్‌కతా హైకోర్టులో ఇక లీగల్ ప్రొసీడింగ్స్‌ను ఆపేయాలని ఆదేశించింది. నకిలీ కులం సర్టిఫికెట్ల కుంభకోణంపై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. నకిలీ కుల ధృవీకరణ పత్రాల కుంభకోణంపై కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి వాదనలను సోమవారం రోజు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.