- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నిరసనల ఎఫెక్ట్.. గవర్నర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిరసనల జ్వాల కేంద్రానికి తాకింది. ఇటీవల ముడా భూకుంభకోణంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విచారణకు అనుమతులు మంజూరు చేశారు. దీనిపై మండిపడిన సిద్దరామయ్య, గవర్నర్ అనుమతి చెల్లదంటూ హైకోర్టుకు వెళ్ళగా, కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎలాంటి విచారణ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉదంతంలో కన్నడనాట గవర్నర్ పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చాలా చోట్ల గవర్నర్ కేంద్రానికి అనుకూలంగా పని చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం గవర్నర్ భద్రతను కట్టు దిట్టం చేస్తూ.. ఒకటి రెండు రోజుల్లో జడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించనున్నట్టు ప్రకటించింది. కాగా మంగళవారం నుండే గవర్నర్ బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుతున్నారు.