Jp nadda: మలేషియా ప్రధానితో జేపీ నడ్డా భేటీ..పలు అంశాలపై డిస్కషన్!

by vinod kumar |
Jp nadda: మలేషియా ప్రధానితో జేపీ నడ్డా భేటీ..పలు అంశాలపై డిస్కషన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత పర్యటనలో ఉన్న మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ నడ్డా బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. పరస్పర పర్యటనలను సులభతరం చేయడం ద్వారా తమ పార్టీల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరువురు అంగీకరించారు. భారత్, మలేషియా మధ్య గత దశాబ్ద కాలంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతినికి ప్రస్తావించారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, ఆయుర్వేద రంగాలలో మరింత సహకారం ఉండాలని అభిప్రాయపడ్డారు. బీజేపీని తెలుసుకోండి కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్టు బీజేపీ ఓవర్సీస్ ఇన్ చార్జ్ విజయ్ చౌతైవాలే తెలిపారు. బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం, దౌత్యవేత్తలు, ఇతర నాయకుల కోసం కాషాయ పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Advertisement

Next Story