Jp nadda: కాంగ్రెస్, ఎన్సీలు పాక్ ఏజెంట్లు.. బీజేపీ చీఫ్ నడ్డా విమర్శలు

by vinod kumar |
Jp nadda: కాంగ్రెస్, ఎన్సీలు పాక్ ఏజెంట్లు.. బీజేపీ చీఫ్ నడ్డా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టికల్ 370 పునరుద్దరణపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) వైఖరితో ఏకీభవిస్తున్నామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేసిన ప్రకటనపై బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. కాంగ్రెస్, ఎన్సీలు పాకిస్థాన్ ఏజెంట్లని విమర్శించారు. బీజేపీ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే వారు పాకిస్థాన్‌తో చర్చలు ప్రారంభిస్తామని చెబుతున్నారని ఆరోపించారు. ఆర్టికల్ 370 విషయంలో వారి వైఖరి సరికాదని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న కశ్మీర్ ఎన్నికలు కేంద్ర పాలిత ప్రాంతంలో స్థిరత్వం, దేశాన్ని బలోపేతం చేయడానికేనని నొక్కి చెప్పారు. ఈ ప్రాంతంలో ఏ ఉగ్రవాది కూడా మనుగడ సాగించలేడని తెలిపారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ పటిష్టంగా ఉందని, అన్ని రంగాల్లో పాక్ కంటే ముందుందన్నారు. అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడేటప్పుడు పాక్‌తో పాటు భారత్‌ను ఎవరూ ప్రస్తావించబోరని తెలిపారు. పాక్ ఉన్న చోటే ఉండగా భారత్ దూసుకుపోతోందని కొనియాడారు. గతంలో మన్మోహన్ సింగ్ అమెరికాకు వెళ్లినప్పుడు ఉగ్రవాదం గురించి మాట్లాడేవారు. కానీ ప్రస్తుతం మోడీ విదేశాలకు వెళ్లినప్పుడు వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్లు, అంతరిక్ష రంగం గురించి మాట్లాడుతున్నారని తెలిపారు.

Next Story