JMM Manifesto : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు..

by Sathputhe Rajesh |
JMM Manifesto : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు..
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఏంఏం) హామీ ఇచ్చింది. సోమవారం ఆ పార్టీ సుప్రీం శిబు సొరెన్ ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేశారు. వ్యవసాయం, విద్య, రెసిడెంట్ల హక్కులతో కలిపి మొత్తం తొమ్మిది రంగాలపై ప్రత్యేకంగా మేనిఫెస్టోలో దృష్టి సారించారు. తొలి విడత ఎన్నికల ప్రచార ముగింపు వేళ హామీ పత్రాన్ని శిబు సొరెన్ విడుదల చేశారు. కాగా రాష్ట్రంలోని మొత్తం 81 సీట్లకు గాను తొలి విడతలో 43 స్థానాలకు పోలింగ్ నవంబర్ 13న, రెండో విడత పోలింగ్ నవంబర్ 20న జరగనుంది.

మేనిఫెస్టోలో చేర్చిన కీలక అంశాలివే..!

- ఎంఎస్ఎంఈలకు రూ.5కోట్ల వరకు రుణాలు

- రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు

- అన్ని డివిజన్‌లలో స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు

- చిన్న, మధ్య తరహా వ్యాపారుల రుణాల మాఫీ

- జీరో పర్సెంట్ వడ్డీ రేటుతో వ్యవసాయ రుణాలు

- రాష్ట్ర నిధుల నుంచి ఫండ్స్ కేటాయించి ఉపాధి కూలీల రోజు వారి కూలీని రూ.350 పెంచడం

- 100 నర్సింగ్ కాలేజీలు, 4,500 మోడల్ పాఠశాలలు, 500 సీఎం స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు

Advertisement

Next Story

Most Viewed