వేర్పాటువాది మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌కు విముక్తి.. గృహ నిర్బంధం నుంచి విడుదల

by Vinod kumar |
వేర్పాటువాది మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌కు విముక్తి.. గృహ నిర్బంధం నుంచి విడుదల
X

న్యూఢిల్లీ : నాలుగేళ్లుగా గృహనిర్బంధంలో ఉన్న కశ్మీర్‌ వేర్పాటువాది, హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌‌కు ఎట్టకేలకు శుక్రవారం విముక్తి లభించింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను 2019 ఆగస్ట్‌ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి ఆయన గృహ నిర్బంధంలోనే ఉన్నారు. హౌస్ అరెస్ట్ నుంచి విముక్తి కోసం జమ్మూకశ్మీర్‌, లడఖ్ హైకోర్టును ఆయన ఇటీవల ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో గురువారం సీనియర్ పోలీసు అధికారులు మిర్వాయిజ్ నివాసానికి వెళ్లి, గృహ నిర్బంధం నుంచి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల కోసం శ్రీనగర్‌లోని జామియా మసీదుకు వెళ్లేందుకూ ఆయనను అనుమతించారు. మిర్వాయిజ్ ఉమర్‌ ఫరూక్‌కు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించడాన్ని మాజీ సీఎంలు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ స్వాగతించారు.

Advertisement

Next Story

Most Viewed