ఇక నువ్వు లేవనే బాధ భరించలేనిది.. రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ఎమోషనల్ ట్వీట్

by Kavitha |   ( Updated:2024-10-10 06:10:26.0  )
ఇక నువ్వు లేవనే బాధ భరించలేనిది.. రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక ఇతని మృతిపై అతని మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ సంతాపం తెలిపారు. ‘ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా’ అంటూ రతన్ టాటాతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఆమె ట్వీట్ చేసింది. కాగా రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయినట్లు 2011లో హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో సిమీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ భామ ఓ ఇంగ్లీష్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తర్వాత బాలీవుడ్, బెంగాలీ వంటి భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది.

(video link credits to simi garewal X account)

Also Read: టాటా ఉత్పత్తిని ఉపయోగించకుండా ఒక రోజును ఊహించడం కష్టం.. రాజ‌మౌళి

Advertisement

Next Story