జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బానుక శివరాజు యాదవ్..

by Kavitha |
జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బానుక శివరాజు యాదవ్..
X

దిశ, జనగామ: జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానుక శివరాజు యాదవ్‌కి వరించింది. చాలా రోజుల నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెలకొనగా ఎట్టకేలకు కాంగ్రెస్ యూత్ నాయకులు బనుక శివరాజ్ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో చాలా మంది ఉండగా వారికి సముచిత స్థానం కల్పిస్తామని అధిష్ఠాన చెప్పినట్లుగా తెలుస్తోంది. జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులకు అవకాశం కల్పించడంతో సంతోషం వ్యక్తం చేశారు.

పాలకవర్గం ఇదే..

బానుక శివరాజు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, కొల్లూరు శివ కుమార్ వైస్ చైర్మన్‌గా, శీలం కొండల్ రెడ్డి, బానోత్ బన్సీ, నామాల శ్రీనివాస్, బొట్ల నర్సింగ్ రావు, బుట్రెడ్డి శ్రీలత రెడ్డి, మహమ్మద్ బాషా మియా, నీలం మోహన్, బండ కుమార్, తోటకూర రమేష్, గాదె రమేష్, వనపర్తి శ్రీనివాస్, నాగబండి రవీందర్‌లను జనగామ మార్కెట్ కమిటీ పాలకవర్గంలోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed