- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
JioHotstar : సరికొత్తగా జియో..హాట్ స్టార్!

దిశ, వెబ్ డెస్క్ : జియో సినిమా(Jio Cinema)..డిస్నీ+హాట్ స్టార్(Disney+Hot Star)లు ఒక్కటయ్యాయి. ఆ రెండు దిగ్గజ సంస్థలు జియోహాట్ స్టార్ (JioHotstar) పేరుతో ఒకే ఫ్లాట్ ఫామ్ గా మారి ఇక నుంచి వినియోగదారులను అలరించనున్నాయి. రెండు ప్రపంచాలు కలిసిన చోట ఒక అద్భుతం ఊపిరి పోసుకుంటుందన్న ట్యాగ్ తో జియో హాట్ స్టార్ (JioHotstar)తో రెండు ఓటీటీ కంటెంట్లు ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి. కొత్త ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన కొత్త లోగోను కూడా రిలీజ్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల్లలో డిస్నీ+హాట్ స్టార్ యాప్ కొత్త లోగోతో జియో హాట్ స్టార్ పేరుకు మారిపోయింది. డిస్నీ+హాట్ స్టార్, జియో సినిమా రెండింటి ప్రస్తుతం యూజర్లు కొత్త ప్లాట్ ఫామ్ లో మారుతారు.
జియోహాట్‌స్టార్ ఫ్లాట్‌ఫామ్‌లో రెండు ఓటీటీల్లో ఉన్న లైబ్రరీ కాంటెంట్‌ను ప్రజెంట్ చేయనుంది. షోలో, సిరీస్‌లతో పాటు సినిమాలు కూడా ప్రేక్షకులు చూడవచ్చు. ఇతర అంతర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు చెందిన కాంటెంట్ కూడా జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. కొత్త స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన వివరాలను జియో హాట్ స్టార్ షేర్ చేసింది. ఇందులో 50కోట్ల మంది వినియోగదారులు, 3లక్షల గంటల కంటెంట్ తో భారత మార్కెట్లో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ గా నిలిచింది. స్పోర్ట్స్ లైవ్ కవరేజీలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఒరిజినల్ కంటెంట్ తో పాటు డిస్నీ, ఎన్ బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్ బీ ఓ, పారామౌంట్ వంటి సంస్థల నుంచి అంతర్జాతీయ కంటెంట్కి కూడా ఈ కొత్త జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. కొత్త స్ట్రీమింగ్ యాప్ లో అల్ట్రా హెచ్ డీ 4కే స్ట్రీమింగ్, మల్టీ యాంగిల్ వ్యూయింగ్, ఏఐ ఆధారిత ఇన్ సైట్స్, రియల్ టైమ్ స్టాట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. జియో హాట్ స్టార్ ను ఫ్రీగా చూడవచ్చు, అయితే యాడ్స్ ప్లే అవ్వడంతో పాటు పెయిడ్ వర్షన్ లోని కొన్ని కంటెంట్స్ చూడలేకపోవచ్చు. అలాంటి వారి కోసం కొత్త ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లానింగ్ రూ.149నుంచి పెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చారు.
ఇండియాకు చెందిన పది భాషల్లో జియోహాట్‌స్టార్ కాంటెంట్ అందుబాటులో ఉంటుంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్ సీఎల్ టీ) గతు ఏడాది ఆగస్టులో డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ విలీనానికి ఆమోదం తెలిపాయి. విలీనంలో భాగంగా రిలయన్స్ కు ప్రత్యక్షంగా 16శాతం, వయాకామ్ 18మీడియా వ్యాపారం ద్వారా 47శాతం వాటా దక్కింది. డిస్నీకి 37శాతం వాటా ఉంది.